హైదరాబాద్, జనవరి 7, 2016
2014 డిసెంబర్ నెలాఖరు వరకు ఆధార్ కోసం పేర్లు నమోదు చేసుకున్న ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల నివాసులు, ఇంతవరకు ఆధార్ కార్డు అందనివారు తమ పేర్లను తిరిగి నమోదు చేసుకోవచ్చని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తెలిపింది. 5 సంవత్సరాల లోపు వయసు ఉండి ఆధార్ పొందిన బాలలు వారికి ఐదేళ్ళు దాటిన తరువాత తమ బయోమెట్రిక్స్ వివరాలను తాజాగా పొందుపరచాల్సి ఉంటుందని యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎం.వీ.ఎస్. రామిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అన్ని పాఠశాలలు, అంగన్ వాడీలలో ఇందుకోసం స్పెషల్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ కొనసాగుతోందని వివరించారు. పిల్లలు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి తమ సమీప ప్రాంతాల్లోని స్కూళ్ళు, అంగన్‌వాడీలను సంప్రదించవచ్చు. ఈ సేవలు పూర్తిగా ఉచితం. ఈ రెండు రాష్ట్రాల నివాసులు ఏ వ్యక్తికి లేదా ఏ సంస్థకూ డబ్బు చెల్లించనక్కరలేదని ప్రకటనలో స్పష్టం చేశారు.
No comments:
Post a Comment