HCU V.C. OUT?

వీసీ అప్పారావు అవుట్..!?

20-1453275149-appa-rao-756
Centre ready to take action on VC of HCU..!
హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ వైఎస్ ఛాన్సెల‌ర్ అప్పారావును తొల‌గించ‌డానికి రంగం సిద్ధ‌మ‌య్యింది. రోహిత్ వేముల మృతి త‌ర్వాత వ్య‌వ‌హారం ఆయ‌న మెడ‌కు చుట్టుకోవ‌డంతో ఇది అనివార్యంగా మారింది. ఇప్ప‌టికే క్యాంప‌స్ లో ప‌ర్య‌టించిన ద్విస‌భ్య క‌మిటీ కూడా వీసీ నిర్ణ‌యాల‌ను త‌ప్పు ప‌ట్టిన‌ట్టు స‌మాచారం. దాంతో కేంధ్ర మాన‌వ‌వ‌న‌రుల మంత్రిత్వ శాఖ నుంచి అప్పారావును తొలిగిస్తూ ఆదేశాలు జారీ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.
వీసీ తీరుతోనే వివాదం కొత్త మ‌లుపు తిరిగింద‌ని అంతా భావిస్తున్నారు. ద‌ళిత విద్యార్థుల ప‌ట్ల అప్పారావు అమానుషంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్టు విచార‌ణ క‌మిటీ భావిస్తోంది. గ‌తంలో కూడా అప్పారావు ఈ క్యాంప‌స్ అదే రీతిలో వ్య‌వ‌హరించిన అనుభ‌వాల‌ను గుర్తు చేస్తున్నారు. చీఫ్ వార్డెన్ గా ఉన్న‌ప్పుడు కూడా వివ‌క్ష ప్ర‌ద‌ర్శించిన‌ట్టు చెబుతున్నారు. దాంతో రోహిత్ స‌హా ద‌ళిత విద్యార్థుల స‌స్ఫెన్ఫ‌న్, ఆత‌ర్వాత వివాదం అంత‌టిలో వీసీ వైఫ‌ల్యం ఉంద‌ని నిర్ధారించారు.
యూనివర్శిటీలో త‌లెత్తిన స‌మ‌స్య‌లు సామరస్యంగా పరిష్కరించడంలో విసి విఫలం అయ్యారని కమిటీ భావిస్తోంద‌ని చెబుతున్నారు. ఈప‌రిస్థితుల్లో 2020 వరకు ఈయన పదవీకాలం ఉన్నప్పట్టికీ ముందుగానే తప్పుకోక త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. కేంధ్రంలోని ఇద్ద‌రు మంత్రుల చుట్టూ వ్య‌వ‌హారం న‌డుస్తున్న‌ప్పుడు విష‌యాన్ని చ‌ల్లార్చ‌డానికి అప్పారావుపై చర్య‌లు అనివార్యం అని అంటున్నారు. కేంధ్ర‌మంత్రి స్మృతి ఇరానీ ప్ర‌క‌ట‌న త‌ర్వాత హెచ్ సీయూలోని 20 మంది ప్రొఫెస‌ర్లు కూడా ఆందోళ‌న బాట ప‌ట్ట‌డంతో వేడి మ‌రింత రాజుకుంది. మ‌రోవైపు ద‌ళిత సంఘాలు రాష్ట్ర బంద్ స‌హా, 25న ఛ‌లో హెచ్ సీయూ కార్య‌క్ర‌మానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. ఈ ప‌రిస్థితులు స‌ర్ధుమ‌ణ‌గాలంటే అప్పారావు పై వేటు ఖాయం అంటున్నారు.
అయితే అప్పారావుకి రాజకీయంగా బ‌ల‌మైన అండ ఉంది. గ‌తంలో చీఫ్ వార్డెన్ గా సస్ఫెండ్ అయిన వ్య‌క్తిని మళ్లీ వీసీగా ఇక్క‌డికి రావ‌డంతో పొలిటిక‌ల్ ప‌వ‌ర్ గ‌ట్టిగా ప‌నిచేసిన‌ట్టు చెబుతున్నారు, ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు కేంధ్ర‌మంత్రుల అండ‌దండ‌లు బ‌లంగా ఉన్నాయ‌ని ప్ర‌చారం సాగుతోంది. లాబీయింగ్ లో కూడా అప్పారావు పెద్ద దిట్ట అని చెబుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో అప్పారావును తొల‌గించ‌డం అంత సామాన్య విష‌యం కాద‌ని అంచ‌నా వేస్తున్నారు.
మ‌రోవైపు అప్పారావు మాత్రం మీడియా ముందుకొచ్చి రోహిత్ మృతిపై వివ‌ర‌ణ‌లిస్తున్నారు. తాను బీజేపీకి చెందిన వ్య‌క్తిని కాదంటున్నారు. రోహిత్ మృతిపై ఉన్న అనుమానాల‌న్నీ తొల‌గించ‌డానికి సమ‌గ్ర ద‌ర్యాప్తు సాగుతోంద‌ని తెలిపారు. తాను మాత్రం ప‌ద‌వి నుంచి వైదొలిగేది లేద‌ని అంటున్నారు.HCU VC OUT

No comments:

Post a Comment

COMMUNISM FREDOM FOR WOMEN

 COMMUNISM IS FREEDOM FOR WOMEN  స్త్రీలను నిర్బంధించి, సంఘటితం చేసే పెట్టుబడిదారీ సమాజాలకు భిన్నంగా, కమ్యూనిజం స్త్రీ పురుషుల సమానత్వాన్ని ...