హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం
సంక్రాంతి సందర్భంగా కోడి పందేలను నిర్వహించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. కోడి పందేల నిర్వహణపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోడి పందేలను అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. కోడి పందేలను జరగనివ్వబోమని, ప్రభుత్వ ఆంక్షలు అతిక్రమించి పందేలు నిర్వహించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది. ప్రభుత్వ వాంగూల్మాన్ని నమోదు చేసుకున్న ధర్మాసనం... దీనిపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం ప్రమాణపత్రం దాఖలు చేసింది.
No comments:
Post a Comment