ఏపీ పెట్టుబడులకు నిలయంగా అవతరిస్తోంది - వెంకయ్య





Navyandhra రాజధాని అమరావతి సహా విశాఖ, కాకినాడ, తిరుపతి నరగాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 42 దేశాల ప్రతినిధులు ఈ భాగస్వామ్య సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పెట్టుబడులకు ఏపీ అనుకూల ప్రదేశమని..ఇక్కడ పెట్టుబడులు పెడితే లాభదాయకంగా ఉంటుందన్నారు. ఏపీకి అభివృద్ధి కోసం కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. చంద్రబాబు లాంటి మంచి ఫెర్మార్మర్ ,రిఫార్మర్ ఏపీకి సీఎంగా ఉండటం సంతోషకరమైన విషమన్నారు. తెంగాణ బ్రాండ్ హైదరాబాద్ అయితే..ఏపీకి చంద్రబాబే బ్రాండ్ అని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. చంద్రబాబు ఆధ్యర్యంలో ఏపీ పెట్టుబడులకు నిలయంగా అవతరిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్య అన్నారు.

No comments:

Post a Comment

COMMUNISM FREDOM FOR WOMEN

 COMMUNISM IS FREEDOM FOR WOMEN  స్త్రీలను నిర్బంధించి, సంఘటితం చేసే పెట్టుబడిదారీ సమాజాలకు భిన్నంగా, కమ్యూనిజం స్త్రీ పురుషుల సమానత్వాన్ని ...