AP Capital facing in trouble

తాత్కాలిక సచివాలయం వ్యవహారం ఆంధ్రప్రదేశ్ సర్కారుకు చుక్కలు చూపిస్తోంది. సర్కారు అసలు ఈ భవనం ఎక్కడ కట్టాలో ఇప్పటివరకూ స్పష్టంగ్ చెప్పాలే ఖ పోతోంది
AP Capital facing in trouble. రాజధాని ప్రాంతం కోసం భూమి సమీకరించిన 29 గ్రామాల్లో ఎక్కడ తవ్వినా..మూడు..నాలుగు అడుగుల్లోనే నీరు వచ్చేస్తోంది. ఇది చూసిన అధికారులు అవాక్కవుతున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ చేపట్టే నిర్మాణాలు కూడా చాలా కష్టతరంగా మారే అవకాశం ఉంది. భూ ఉపరితలంపైనే నీరు ఉండటంతో భవనాల నిర్మాణానికి పైల్ పౌండేషన్ వేయటం తప్పనిసరి అవుతుందని..ఈ ఫౌండేషన్ కే కనీసం రెండు నెలల సమయం పడుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. అంటే పైల్ పౌండేషన్ వేసిన తర్వాత అది తాత్కాలిక సచివాలయం కాదని..పూర్తి స్థాయి నిర్మాణాలే చేపట్టాల్సి ఉంటుందని..ఇదంతా ఓ గందరగోళంగా మారిందని సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి.
ఒక్కసారి  పైల్ ఫౌండేషన్ వేసిన తర్వాత అక్కడ శాశ్వత నిర్మాణాలే చేపట్టాల్సి ఉంటుంది కానీ..తాత్కాలిక నిర్మాణాలు ఉండవని చెబుతున్నారు. ఇన్ని గందరగోళాల మధ్య తాత్కాలిక సచివాలయం ఏర్పాటు ఎక్కడ ఉంటుందో ఎవరికీ అర్థం కావటం లేదు. అయితే సర్కారు ఫ్యాబ్రికేటెడ్ మార్గంలో వెళుతుందా..లేక శాశ్వత నిర్మాణాల మార్గంలో వెళుతుందా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను చూసిన సచివాలయ ఉద్యోగులు మాత్రం జూన్ కు విజయవాడ వెళ్లాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు ఇఫ్పటికీ జూన్ నాటికి సచివాలయం విజయవాడకు తరలింపు జరిగే పనికాదని నమ్మకంతో ఉన్నారు. అందుకే ఎక్కడ ఇద్దరు ఉద్యోగులు కలిసినా ఇదే చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం జూన్ నాటికి అన్ని శాఖలు విజయవాడకు తరలిరావాల్సిందేనని చెబుతున్నా..మంత్రులు మాత్రం రకరకాలుగా మాట్లాడుతూ ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నారు. దీనికి తోడు 180 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో  ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన తాత్కాలిక సచివాలయం నిర్మాణం ఇప్పుడెలా? అన్నదే ఇఫ్పుడు పెద్ద సమస్యగా మారిందని చెబుతున్నారు.

No comments:

Post a Comment

COMMUNISM FREDOM FOR WOMEN

 COMMUNISM IS FREEDOM FOR WOMEN  స్త్రీలను నిర్బంధించి, సంఘటితం చేసే పెట్టుబడిదారీ సమాజాలకు భిన్నంగా, కమ్యూనిజం స్త్రీ పురుషుల సమానత్వాన్ని ...